Kidney Rocket | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు అయింది. సరూర్‌నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకానంద ఆస్పత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడిలు చేస్తున్నట్లు వైద్యాధికారులు, పోలీసుల విచారణలో తేలింది.
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో గీతా, సరూర్ నగర్ పీహెచ్సీ వైద్యురాలు అర్చన, జీహెచ్ఎంసీ అధికారులు, సరూర్ నగర్ పోలీసుల సహకారంతో అలకానంద ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం నలుగురు రోగులను అధికారులు విచారించారు. ఇందులో ఇద్దరు కిడ్నీలను దానం చేయగా, మరో ఇద్దరికి ఆ కిడ్నీలను అమర్చినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరిది కర్ణాటక కాగా, మరో ఇద్దరిది తమిళనాడు అని అధికారులు తేల్చారు. ఈ నలుగురు రోగులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని అలకనందా హాస్పిటల్లో గత కొంతకాలం నుంచి కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Venu Swamy | తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరైన వేణుస్వామి
MLA Padma Rao Goud | సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
KTR | సమస్యలకు కేరాఫ్‌గా హైదరాబాద్ నగరం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్