హైదరాబాద్ : నగరంలోని బేగంపేటలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానికంగా ఉన్న వెల్సన్ పార్కు సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తుండగా, నిర్మాణదారుడు అడ్డుకున్నారు. మున్సిపల్ సిబ్బందికి భవన యజమానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్కు స్థలంలో అక్రమ భవనం నిర్మించాడంటూ మున్సిపల్ ఏసీపీ తెలిపారు.