సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, అడిషనల్ కమిషనర్లు నళినీ పద్మావతి, యాదగిరి రావు, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, పంకజ, సీసీపీ శ్రీనివాస్, సీపీఆర్వో మహమ్మద్ ముర్తుజా అలీ, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, రవికిరణ్, వెంకన్న, ఓఎస్డీ వేణుగోపాల్, ఆయా విభాగాల సీనియర్ అధికారులు కమిషనర్ ఇలంబర్తిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.