సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ): నిర్దేశిత సమయం దాటిన తరువాత కూడా రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. బుధవారం ఆయన సర్కిల్ -19 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
రహదారులపై చెత్తకుప్పలు కనిపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను ఈ నెల 21 (నేటి) నుంచి 25వ తేదీ వరకు అయిదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.