సిటీబ్యూరో, జూలై 31 ( నమస్తే తెలంగాణ ) : వర్షాకాలంలో పాములు సంచరించే అవకాశం అధికంగా ఉంటుందని, ఎవరూ భయభ్రాంతులకు గురికాకుండా తమకు సమాచారం అందించాలని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్సన్ ఆఫ్ క్రుయాల్టీ టూ యానిమల్స్ (జీహెచ్ఎస్పీసీఏ) సభ్యుడు సౌధర్మ్ బండారి సూచించారు.
పాములకు ఎటువంటి హాని చేయకూడదన్నారు. ఇప్పటికే తాము అనేక పాములను పట్టుకొని సంరక్షించామని వివరించారు. పాములు కనిపిస్తే 9394578568, 8886743881, 9441131481 నంబర్లలో సంప్రదించాలని కోరారు.