శనివారం 06 మార్చి 2021
Hyderabad - Jan 23, 2021 , 07:05:35

సౌండ్‌ మారితే.. సీజే

సౌండ్‌ మారితే.. సీజే

  • శబ్ద కాలుష్యాన్ని సృష్టించే వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌
  • రాచకొండ అదనపు ట్రాఫిక్‌ డీసీపీ తాజుద్దీన్‌

సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): వెరైటీ హారన్‌లను మోదినా.. సైలెన్సర్లతో రోడ్లపై శబ్ద కాలుష్యాన్ని సృష్టించినా.. ఇక ఆ వాహనాన్ని సీజ్‌ చేస్తామని అదనపు ట్రాఫిక్‌ డీసీపీ తాజుద్దీన్‌ హెచ్చరించారు. కొంతమంది యువత రహదారులపై వెరైటీ హారన్‌లు మోగించడంతోపాటు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాడుతున్నారు. దీంతో ఇతర వాహనదారులు భయాందోళనకు గురై ఫిర్యాదులు చేయడంతో రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు శబ్దకాలుష్యాన్ని సృష్టించే వాహనాలపై నజర్‌ పెట్టారు. వాహన కంపెనీలు ఇచ్చే హారన్‌లు, సైలెన్సర్లు కాకుండా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా వాటికి బదులు కొత్తవి ఉపయోగిస్తున్నారని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక శబ్ద కాలుష్యాన్ని సృష్టించే వా హనాలను సీజ్‌ చేసి కోర్టులో డిపాజిట్‌ చేస్తామన్నారు. ఇటీవల చాలా మంది యువకులు బుల్లెట్‌ సైలెన్సర్లను మార్చి తీవ్ర శబ్దాన్ని సృష్టిస్తున్నారని, అలాంటి వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని అదనపు ట్రాఫిక్‌ డీసీపీ పేర్కొన్నారు.


VIDEOS

logo