RS Praveen kumar | ఓ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ లైంగికదాడి యత్నం చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైంది. బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే మహిళలు పేట్ బషీరాబాద్ ను పీఎస్‌ను ముట్టడించగా.. మరోవైపు బీఆర్ఎస్వీ నాయకులు డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించారు.
కాగా బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బండి సాయి భగీరథ్ దారుణాలను మీడియా ముఖంగా చెప్పారు. తాజాగా మరో ప్రకటన చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడాను.. వారు తెలియజేసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలాగా ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరికాసేపట్లో బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోక్సో కేసుపై సంచలన విషయాలు బయటపెడతానన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పబోయే కీలక విషయాలు ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?