ఎర్రగడ్డ, జనవరి 30 : వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక బోరబండలో ఆయనకు కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానన్నారు. ఈ స్థాయికి రావడానికి కారణం పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఇంత మంచి పనులు జరుగుతుంటే బీజేపీ ఓర్వలేకపోతున్నదని.. ఆ పార్టీ వాళ్ల మాటలను ఎట్టి పరిస్థితిలోనూ నమ్మవద్దని సూచించారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఇంటిపై గులాబీ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. బోరబండ విషయానికి వస్తే బాబా ఫసియుద్దీన్ ప్రత్యేక శ్రద్ధ వ హించి సకల సౌకర్యాలను సమకూర్చడం జరిగిందన్నారు.సైట్-1 కాలనీ తుర్రెబాజ్‌ఖాన్ కమ్యూనిటీహాల్లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అం తకు ముందు కాలనీలో ఎమ్మెల్యే మొక్కలు నాటా రు. కాలనీ కమాన్ నుంచి కమ్యూనిటీహాల్ వరకు పాదయాత్రగా వెళ్తున్న గోపీనాథ్‌పై స్థానికులు భవనాలపై నుంచి పూలవర్షాన్ని కురిపించారు. డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్, పార్టీ నేతలు పాల్గొన్నారు.