సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూము ల పరిరక్షణకు సంబంధించి చట్టాలున్నప్పటికీ వాటిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్య త ప్రభుత్వంపైనే ఉంటుంది.., చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతి లేని లే ఔట్లలోని ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని వ్యవస్థ రావాలని, మాస్టర్ ప్లాన్లోప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు దుర్వినియోగమైతే నేరుగా చర్య లు తీసుకోవచ్చని పలువురు న్యాయ నిపుణు లు అభిప్రాయపడ్డారు. శనివారం బుద్ధ భవన్‌లోని హైడ్రా కార్యాలయంలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడటంలో తలెత్తుతున్న ఇబ్బందులు, న్యాయపరమైన అంశాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ‘వర్క్‌షాప్ ఆన్ లీగల్ ఇష్యూస్ పైర్టెనింగ్ టు హైడ్రా’ వన్ డే వర్క్‌షాప్ నిర్వహించారు.
చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవనానికి పనిచేస్తున్న హైడ్రాకు ఎల్లప్పుడు న్యాయ సలహాలు అందించడానికి సిద్ధంగా ఉంటామని న్యాయవాదులు రంగనాథ్‌కు చెప్పారు. చెరువులను పునరుద్ధరించడం, వరద కాలువలను సజీవంగా ఉంచడంతోనే నగరానికి వర ద ముప్పు తగ్గుతుందని నిపుణులు సూచించారు. గొలుసుకట్టు చెరువులు లింక్ తెగిపోవడంతో రెండు సెంటిమీటర్లు దాటి వర్షం పడితే నగర రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని నిపుణులు చెప్పారు. ప్రభుత్వ శాఖల మధ్య హైడ్రా సమన్వయం చేసినప్పుడే నగరంలో వరద ముప్పు నివారించే అవకాశం ఉంటుందని వారు రంగనాథ్‌కు చెప్పారు.
చెరువు శిఖం భూముల విషయంలో ప్రైవేటు పట్టాలున్న వారు వ్యవసా యం మాత్రమే చేసుకోవాలని మరే ఇతర హ క్కులు ఉండవని చెప్పారు. చెరువుల మధ్య నుంచి పలుచోట్ల రహదారులు నిర్మించారని, అయితే, ఇరువైపులా నీటికి అడ్డు లేకుండా పై వంతెనలు కడితే బాగుంటుందన్నారు. చెరువుల బఫర్ జోన్లలో మట్టితో నింపేసి, వారి స్థలం ముంపు ప్రాంతంలో లేదని చూపించే ప్రయత్నాలను ఎన్ఆర్ఎస్ఏ, సర్వే ఆఫ్ ఇం డియా, గ్రామీణ మ్యాప్‌ల ద్వారా నివారించవచ్చన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోకి గ్రామా లు చేరినప్పుడు గ్రామ పంచాయతీ లేఔట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని వారు స్పష్టం చేశారు.
లే ఔట్లలో 30 శాతం భూమిని ప్రజావసరాల కోసం కేటాయించాల్సి ఉంటుందని, అనుమతి పొందిన లే ఔట్‌ను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే చట్టం ప్రకారం, కూల్చివేయవచ్చని వర్క్‌షాప్‌లో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వర్క్‌షాప్‌లో హైకోర్టు సీనియర్ న్యాయవాది రేసు మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ, హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కె.రవీందర్ రెడ్డి, అసిస్టెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సీహెచ్ జయకృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.శ్రీనివాసరావు, సీసీఎల్ఏ రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, ప్రొ. పి.రాజ్‌గోపాల్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు, వివిధ శాఖలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.