హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా (HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నగర శివార్లలోని పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపూర్‌లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పర్వతాపూర్ స్మశాన వాటికలోని కొంత భూమిని ఆక్రమించారు. సర్వే నంబర్ 1, 12ల్లోని స్మశాన వాటికల్లోని భూమిని కబ్జా చేసి వాటిని విక్రయిస్తున్నారు. గత రెండేండ్లుగా ఈ తంతు కొనసాగుతుండటంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది గురువారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రా చీఫ్ రంగనాథ్ పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ కట్టడాలను తొలగిస్తామని తెలిపారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితులు కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రేవంత్ రెడ్డి వచ్చి పేదల మీదనే పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం వస్తున్నదని ఖాళీ చేయడానికి రెండు గంటలు కాస్త సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా కూల్చివేశారన్నారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదొడికి ఒక న్యాయమా అంటూ శాపనార్థాలు పెట్టారు. చట్టం, న్యాయం అందరికీ ఒకే విధంగా వర్తింప చేయరా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.
ఈ రండ ప్రభుత్వం వచ్చి పేదల మీదనే పడ్డాడు రేవంత్ రెడ్డి
ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా వర్షం ఉంది.. ఖాళీ చేయడానికి రెండు గంటలు కాస్త సమయం ఇవ్వాలని కోరిన బాధితులు
వినకుండా కూల్చేసిన హైడ్రా అధికారులు
తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదొడికి ఒక న్యాయం
చట్టం న్యాయం అందరికీ… pic.twitter.com/s7mbgjYj5p
— Telugu Scribe (@TeluguScribe) May 22, 2025