అబిడ్స్, అక్టోబర్ 17: గోషామహల్ నియోజకవర్గం మంగళ్‌హాట్ డివిజన్ పరిధిలోని ధూల్‌పేట శివలాల్‌నగర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. హైడ్రా అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో ఆక్రమణలను కూల్చి వేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జ్యోతి కూల్చివేతలను పర్యవేక్షించగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.