HYDRAA | సిటీబ్యూరో: గ్రేటర్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా దృష్టిపెట్టిందని, 50 మందికి నోటీసులంటూ సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. కొన్నిరోజుల కిందట అమీన్పూర్లో కిష్టారెడ్డిపేటలో ఒక సర్వేనంబర్ చూపించి మరో సర్వే నంబర్లో భూమి అమ్మడంపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా బృందం సర్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.
సర్వే రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించి విచారణ చేపడతామన్నారు. అయితే ప్రస్తుతం హైడ్రా బృందం బెంగళూరులో ఉన్న సమయంలో హైడ్రా నోటీసులంటూ, కూల్చివేతలు, పదిహేను రోజుల గడువంటూ వైరల్ అవుతున్నది. దీంతో రంగనాథ్ ఇదంతా ఫేక్ ప్రచారమంటూ ఖండించారు.