కాచిగూడ,సెప్టెంబర్ 12 : ఇంట్లోంచి బయటకువెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకలోని సంజీవయ్యనగర్ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమారుడు తేజ(17)నారాయణగూడలో ఇంటర్ చదువుతున్నాడు.
శనివారం రాత్రి ఇంట్లోంచి వెళ్లిన తేజ ఇప్పటికి ఇంటికి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తండ్రి రమేశ్ ఆదివారం కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇంట్లోంచి తేజ వెళ్లే సమయంలో నీలి రంగు చొక్క, పసుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.