కందుకూరు, నవంబర్ 13 : రాష్ట్రంలో ప్రతి పక్షాలను ప్రజలు నమ్మరని, మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదన్నారు.
ప్రతి పక్షాల మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు విజ్ఞేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.