Oxygen Therapy Chamber | బంజారాహిల్స్, ఫిబ్రవరి 20 : వివిద ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి స్వచ్చమైన ఆక్సిజన్‌ను అందించేందుకు హైదరాబాద్‌లో మొట్టమొదటి అక్సిజన్ థెరపీ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 20 మందికి హైపర్ బేరిక్ అక్సిజన్ థెరపీ(హెచ్‌బీఓటీ)ని విజయవంతంగా పూర్తిచేశారు.

ఈ సందర్భంగా ఫిజికల్ థెరపిస్ట్ సయ్యద్ ఖలీల్ మాట్లాడుతూ.. హైపర్ బేరిక్ అక్సిజన్ థెరపీ అనే విధానంలో ప్రత్యేకమైన చాంబర్లో ఉండడం ద్వారా 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను శరీరానికి అందించగలమన్నారు. సాధారణంగా శ్వాస ద్వారా పీల్చుకునే ఆక్సిజన్ కేవలం 20 శాతం మాత్రమే ఉంటుందని, దానిలో కేవలం 5 శాతం మాత్రమే వినియోగం అవుతుందన్నారు. అయితే హెచ్‌బీఓటీ ద్వారా నిర్దేశిత సమయం పాటు 100 శాతం ఆక్సిజన్‌ను శరీరంలోకి పంపించడం ద్వారా యాంటీ ఏజింగ్, మెటబాలిక్ సమస్యలను తగ్గించడం. రోగనిరోధక శక్తి పెంపు, కణజాలం బలోపేతం తదితర ప్రయోజనాలు అందకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వివిద దేశాల్లో వైద్యులు, అథ్లెట్లు, వెల్నెస్ ఔత్సాహికులు ఈ విధానాన్ని ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించారని, దీన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ సంస్థ జూబ్లీహిల్స్‌లో ఆక్సిజన్ చాంబర్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.