ములుగు, జూలై 22 : కొండ పోచమ్మ రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు మునిగి హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సాయి కృష్ణ (22) ఐదుగురు స్నేహితులతో కలిసి మిత్రుడి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వచ్చారు.
సరదాగా జలాశయంలో స్నానం చేసేందుకు నీటిలో దిగగా ముగ్గురు యువకులు లోతైన ప్రాంతంలోకి వెళ్లారు. సాయి కృష్ణ నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి ములుగు, మర్కూక్ ఎస్ఐలు విజయ్‌కుమార్, దామోదర్ ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.