జవహర్‌నగర్: యాప్రాల్‌లో దారు ణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడంటూ తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో ఓ యువకుడిని తోటి స్నేహితు లు దారుణంగా చితకబాదగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యాప్రాల్ భగత్‌సింగ్‌కాలనీలో వెంకటనర్సయ్య కుటుంబం నివసిస్తున్నది. వెంకటనర్సయ్య రెండో కుమారుడు ప్రణీత్ (21) డ్రైవ్రర్గా పనిచేస్తున్నాడు. ప్రణీత్‌కు అదే కాలనీకి చెందిన గోవర్దన్ మిత్రుడు.
ప్రణీత్ చేస్తున్న ప్రచారాన్ని మనసులో పెట్టుకున్న గవర్దన్.. ఈ నెల 5న గోవర్ధర్(27), జశ్వం త్(20), విన్సెంట్(19) కలిసి ప్రణీత్‌ను పిలుపించుకున్నారు. బైక్‌పై ఫుట్‌బాల్ మైదానానికి తీసుకెళ్లి చితకబాదారు. దీంతో అపస్మారక స్థితిలోకి ప్రణీత్ వెళ్లగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు, జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు ప్రణీత్‌ను ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించగా ఈ నెల 6న గాంధీకి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రణీత్ మంగళవారం ఉదయం మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోవర్ధన్, జశ్వంత్, విన్సెంట్‌ను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించామని ఎస్హెచ్ఓ సైదయ్య తెలిపారు.