సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): లండన్ఎయిర్పోర్టులో మీ కొడుకుకు యాక్సిడెంట్ అయిందని అతడికి ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బులు కావాలంటూ చెప్పి నగరవాసి నుంచి రూ.35.23లక్షలు సైబర్‌నేరగాడు కొట్టేశారు. నగరానికి చెందిన 61ఏళ్ల వృద్ధురాలికి లండన్‌లోని సౌత్మాంచెస్టర్ జనరల్ హాస్పిటల్‌లోని యురాలజిస్ట్ డా.స్టీవ్ రోడ్రిగ్జ్ పేరుతో వాట్సాప్ కాల్ వచ్చింది. బాధితురాలి కొడుకు లండన్ ఎయిర్‌పోర్ట్‌లో యాక్సిడెంట్‌కు గురయ్యాడని, అతడి తలకు తీవ్రగాయలైనట్లుగా చెప్పారు.
ఆమె కొడుకు లగేజ్ కనిపించడం లేదని, దీంతో ఆసుపత్రి వారు అతడిని ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా చేర్చుకోమని చెప్పారని తెలిపారు. దీంతో తాను అతడిని హాస్పిటల్లో చేర్చానని ట్రీట్మెంట్ ప్రారంభించాలంటే డబ్బులు కావాలని చెప్పడంతో నమ్మిన మహిళ ఆగస్ట్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వరకు పలుసార్లు ఆన్లైన్ ద్వారా నేరగాడు చెప్పిన అకౌంట్లకు రూ.35,23,070లు పంపించింది. తర్వాత బాధితురాలు నేరగాడిని తన కొడుకు ఆరోగ్య స్థితిపై ఫొటో కానీ వీడియో గానీ పంపించాలని కోరగా అతడు నిరాకరించి వాట్సాప్ చాట్ వివరాలను డిలీట్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.