హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ షాపింగ్‌మాల్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న హెచ్అండ్ఎం షాపింగ్‌మాల్‌లో ఒక యువతి దుస్తులు మార్చుకుంటుండగా నిందితులు వీడియోలు తీశారు.
దీన్ని గమనించిన యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో తీసిన ఇద్దరు విద్యార్థులను గుర్తుపట్టి పోలీసులకు పట్టించింది. వారితోపాటు స్టోర్ మేనేజర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి వీడియో తీసిన మొబైల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.