మాదాపూర్, అక్టోబర్ 24: హైదరాబాద్‌ను ఫార్మా రంగంలో ఓ ల్యాండ్ మార్క్‌గా మార్చడానికి అందరు చేతులు కలపాలని సీనియర్ ఫార్మా అధ్యక్షుడు టీవీ నారాయణ అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఫార్మా ఇండియా ఎక్స్ పో- 2024 కార్యక్రమా న్ని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, బిస్టన్ విశ్వవిద్యాలయం ఏఐ శాస్త్రవేత్త వై. శ్రీధర్‌రెడ్డిలతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రపంచంలోనే ఫార్మా కంపెనీల క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి అడుగులు పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశీయ ఫార్మా రంగం వార్షిక టర్నోవర్ 6500 కోట్ల డాలర్లు ఉండగా, 2047 నాటికి 45 వేల కోట్ల డాలర్లకు చేరుతుందన్నారు. ఫార్మా రంగంలో మరింత అభివృద్ధిని సాధించాలంటే పర్యావరణ హిత పరిశ్రమలను నెలకొల్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇందులో 250 స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.