స్పీడ్ 300 KM/H.. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్
విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక పోటీలకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్‌కు వేదిక కానున్న నేపథ్యంలో ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు ముస్తాబైంది. ట్రయల్ రన్లో భాగంగా ఈ నెల 19, 20 తేదీలలో పోటీలు జరుగనుండగా, 19న మధ్యాహ్నం 3.10 గంటలకు తొలి రేస్ ప్రారంభం కానున్నది
- ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు సర్వం సిద్ధం
- ట్రాక్ టెస్టింగ్‌కు నిర్వాహకుల ఏర్పాట్లు
- 19న మధ్యాహ్నం 3.10 గంటలకు తొలి రేస్
- రేస్ నేపథ్యంలో సాగరతీరంలో పార్కులు బంద్
- ఈ నెల 20 వరకు ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు
విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక పోటీలకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్‌కు వేదిక కానున్న నేపథ్యంలో ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు ముస్తాబైంది. ట్రయల్ రన్లో భాగంగా ఈ నెల 19, 20 తేదీలలో పోటీలు జరుగనుండగా, 19న మధ్యాహ్నం 3.10 గంటలకు తొలి రేస్ ప్రారంభం కానున్నది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో రేసింగ్ కార్లు దూసుకెళ్లేలా ట్రాక్‌ను సిద్ధం చేశారు. రేసింగ్ నేపథ్యంలో ఈ నెల 20 వరకు ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఈ నెల 18 నుంచి 20 వరకు సాగరతీరంలోని పార్కులను మూసివేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగనున్న ఈ రేసింగ్ పోటీలతో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగనున్నది.
సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు హుస్సేన్ సాగర్‌ను ముస్తాబైంది. ఈ నెల 19-20న ప్రారంభమయ్యే ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ట్రాక్ టెస్టింగ్, గ్యాలరీ, సేఫ్టీ బారికేడింగ్ ఏర్పాటు చేశారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ పోటీలు 19న మధ్యాహ్నం 3.10 గంటలకు తొలి రేస్ ప్రారంభం కానుంది. పది నిమిషాల తర్వాత రెండో రేస్, 4గంటల నుంచి మరో 45 నిమిషాల పాటు ఇంకో లీగ్ జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి పనులు చేపట్టారు. ఇప్పటికే ఇటలీకి చెందిన 14మంది సభ్యుల బృందం నగరానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్లు వచ్చాక డ్రైవింగ్ మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు. ట్రాక్ టెస్టింగ్ కోసం జరిగే ఈ పోటీల్లో 11 టీంలు బరిలో దిగనుండగా, ఇండియాకు చెందిన 10మంది రేసర్లు పాల్గొంటారని నిర్వహకులు రేసింగ్ ప్రమోషన్ వెల్లడించింది.
ట్రాక్ టెస్టింగ్
300 కిలోమీటర్ల వేగంతో రేసింగ్ కార్లు దూసుకుపోయేందుకు ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఫార్ములా – 1 రేసింగ్ ట్రాక్‌లాగా కాకుండా బ్లాక్ టాపింగ్ రోడ్లను రేస్ లీగ్ కోసం ఏర్పాటు చేశారు. మూడు వారాల వ్యవధిలో రెండు రేసుల ద్వారా ట్రాక్ టెస్టింగ్ చేసి వచ్చే ఏడాదిలో జరిగే ఫార్ములా ఈ-రేస్ పోటీలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇక రేస్ పోటీలను చూసేందుకు వచ్చే ప్రేక్షకులతోపాటు, సింగిల్ సీటింగ్ డ్రైవింగ్ విధానంలో జరిగే రేసర్ల సేఫ్టీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేసినట్లుగా నిర్వహకులు తెలిపారు.
విశ్వనగరాల జాబితాలో మహానగరం..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా ఈ ఛాంపియన్ షిప్ పోటీలతో హైదరాబాద్ విశ్వ నగరాల జాబితాలో చేరింది. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీలకు అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ కేంద్రంగా రేసింగ్ పోటీలను నిర్వహించేందుకు ఎంపిక చేశారు. దీంతో లండన్, ప్యారిస్, మొనాకో, బెర్లిన్ నగరాల్లోని రేస్ సర్క్యూట్ తరహాలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ రేసింగ్ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఈవీ టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు కీలకంగా మారుతుందని నిర్వాహకులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేస్ లీగ్ పోటీల నేపథ్యంలో ఈ నెల 16 రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు వివిధ కూడళ్లలో హుస్సేన్‌సాగర్ పరిసరాలలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ రేస్‌ల కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లస్ రోడ్డు, లుంబినీ పార్కు 18 నుంచి 20వ తేదీ వరకు మూసివేస్తారని తెలిపారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపు
అఫ్జల్‌గంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, తెలుగు తల్లి ైప్లెఓవర్, కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ రూట్లలోకి మళ్లిస్తారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
- పీవీ విగ్రహం (ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు, పీవీ విగ్రహం వద్ద సాదన్ కాలేజ్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
- బుద్ధభవన్, నల్లంపట్ట జంక్షన్ నుంచి నెక్లస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
- రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ నుంచి తెలుగు తల్లి జంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ైప్లెఓవర్ పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.
- ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి నుంచి నెక్లస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు వెళ్లాలి.
- బీఆర్కేఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్మినార్, రవీంద్ర భారతి జంక్షన్‌కు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్‌కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఖైరతాబాద్ బడా గణేశ్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడాగణేశ్ వద్ద రాజ్‌దూత్ లైన్లోకి మళ్లిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
Psoriasis | సోరియాసిస్, ఎగ్జిమా.. రెండింటి మధ్య తేడాలేమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..?
Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

