ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో.. టాప్ 20లో హైదరాబాద్
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ఖ్యాతి పొందింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలోని భారత దేశ నగరాల్లో మూడో స్థానంలో ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ‘యాక్టివ్ క్యాపిటల్ ఏసియా పసిఫిక్- రైజింగ్ క్యాపిటల్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్’ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. పట్టణీకరణ ఒత్తిడి, వాతావరణ ప్రమాదం, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా 36 నగరాలకు రేటింగ్ ఇచ్చింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ వంటి నగరాలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో మొదటి ఐదు గ్రీన్-రేటెడ్ నగరాల జాబితాలో ఉన్నాయి.
కాగా, ఏపీఏసీ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2021లోని మొదటి ఇరవై స్థిరమైన నగరాల్లో నాలుగు భారతీయ నగరాలున్నాయి. ఇందులో బెంగళూరు, ఢిల్లీ తర్వాత, స్థిరమైన వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది. స్థిరమైన అభివృద్ధిని సృష్టించేందుకు రియల్ ఎస్టేట్ రంగం నిబద్ధతకు ఇది మంచి సూచన అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి వృద్ధిని కొత్త మార్కెట్ డైనమిక్స్ ప్రోత్సహించాయని చెప్పారు. ప్రపంచ నిబద్ధత పర్యావరణ అనుకూల ప్రమాణాలైన కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ జీరోపైలపై ప్రధానంగా దృష్టి సారించాయని అన్నారు. భారతీయ డెవలపర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను పెంచుకోవడానికి ఇది తోడ్పడిందని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

