డ్రగ్స్ కేసులో 500 మందిపై నజర్
పుడింగ్ అండ్ మింక్ పబ్‌కు వచ్చే రెగ్యులర్ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్‌కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయే ఖాతాదారులున్నట్లు గుర్తించారు
పుడింగ్ పబ్ రెగ్యులర్ కస్టమర్లపై ఆరా
రహస్యంగా వచ్చే వారి వివరాలు సేకరణ
నేడు పోలీస్ కస్టడీకి నిందితులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పుడింగ్ అండ్ మింక్ పబ్‌కు వచ్చే రెగ్యులర్ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్‌కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయే ఖాతాదారులున్నట్లు గుర్తించారు. రాడిసన్ బ్లూ ఆవరణలో నిర్వహించే ఈ పబ్‌లోకి ఎంట్రీ కావాలంటే పామ్ యాప్‌లో రూ.50 వేల నుంచి లక్ష చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో సభ్యత్వం తీసుకున్న వారినే నిర్వాహకులు లోపలికి అనుమతిస్తారు.
అయితే సభ్యత్వం లేకుండా పబ్బుకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు 500 వరకు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అందులో కొందరి వివరాలను ఇప్పటికే సేకరించారు. మిగతావారి వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అర్ధరాత్రి తరువాత పబ్బు తెరిచి ఉంటుందనే భావనతో వచ్చే కస్టమర్లు కొందరైతే, డ్రగ్స్ దొరుకుతుందని, ఆ సమయంలో ఎవరూ పట్టించుకోరనే భావనతో వచ్చే వారు మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సేకరించిన కస్టమర్ల వివరాలు సీసీ పుటేజీలు, కాల్ డేటాను క్రోడీకరించి నిందితులను ఆయా అంశాలపై ప్రశ్నించనున్నారు.
నేడు పోలీస్ కస్టడీకి నిందితులు
న్యాయస్థానం అనుమతి మేరకు గురువారం నిందితులు ఉప్పల అభిషేక్, మేనేజర్ అనిల్‌కుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అందజేశారు? ఎప్పటి నుంచి డ్రగ్స్ దందా నడుస్తున్నది? ఎంత మంది కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేశారనే ప్రధాన అంశాలపై పోలీసులు విచారణ చేయనున్నారు. ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా ప్రశ్నించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Drugs Case
- Hyderabad
- Police
- Pub
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

