సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమసే తెలంగాణ) : సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మోసగించేందుకు వాడుతున్న ఖాతాను పట్టుకునేందుకు సిబ్బందికి జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన అంశాల దర్యాప్తులో సీబీఐ, ఈడీలకు పట్టున్నందున వారితో సైబర్ క్రైం పోలీసులకు శిక్షణ ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
ములాల వరకు వెళ్లి నిందితులు ఎక్కడున్నా పట్టుకొస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని, సైబర్నేరగాళ్లలో భయం ఉంటుందని, ఇందులో భాగంగానే సిబ్బందికి జాతీయ దర్యాప్తు సంస్థల అధికారులతో శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది.