CV Anand | సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్‌కు హైదరాబాద్‌పై పూర్తి పట్టుంది. ఈ క్రమంలో తిరిగి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ.. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసిందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి
28 గ్రామాల రికార్డులు స్వాధీనం
మేడ్చల్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 28 గ్రామ పంచాయతీలను ఇటీవలే విలీనం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గ్రామ పంచాయతీల రికార్డులను జిల్లా అదనపు (స్థానిక సంస్థల )కలెక్టర్ రాధికా గుప్తా ఆదేశాల మేరకు జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య
మారేడ్‌పల్లి: ఆర్థిక ఇబ్బందులతో రైలు కిందపడి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల ప్రకారం.. నారపల్లికి చెందిన నర్సింహరాజు (39) గోపాలపురంలో రెండేండ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల నర్సింహరాజుకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఘట్కేసర్- బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.