సికింద్రాబాద్, ఫిబ్రవరి 2 : నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ ఎంతో మేలు చేస్తాయని శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ పేర్కొన్నారు. బుధవారం ఒంటిమామిడిలో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరవస్తు మధుకర్ స్వామితో కలిసి శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ ‘కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ -2022’ను ఆవిష్కరించారు. ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఇయర్ బుక్ -2022 ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సరైన ప్రణాళికతో శ్రమిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, భిక్షపతి, నాగరాజు, శేఖర్, సురేశ్, కేవీఆర్, తదితరులు పాల్గొన్నారు.