సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : మెట్రో సమయాలను పొడిగిస్తారనే ఆశలపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నీళ్లు చల్లింది. మెట్రో సమయాల్లో ఎలాంటి పొడిగింపు లేదని ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. సోమ (ఉదయం 5.30), శుక్రవారం (రాత్రి 11.45 గంటలకు) జరిగినది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, పలు పరిశీలనల తర్వాతే ఆ వేళలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అప్పటివరకు యధావిధిగానే ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి సేవలను పొడిగిస్తామన్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాతే సమయాలపై స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు.