హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ (Freedom Offer) పేరుతో ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.59తో హెట్రో హాలిడే కార్డును (Holiday card) రీచార్జ్ చేసుకుంటే ఆగస్టు 15న రైళ్లలో (Metro Rail) నగరంలో ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చని మెట్రో అధికారులు వెల్లడించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రోలో ప్రయాణం చేసేందుకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.