సిటీబ్యూరో: రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.