అబిడ్స్, ఫిబ్రవరి 23 : డెక్కన్ బ్లాస్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మన్నన్‌ఖాన్ ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్ ఖాజామెన్షన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హైదరాబాద్ మెగా జాబ్‌మేళా విజయవంతం అయింది.
వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు 200 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ మెగా జాబ్ మేళాను ఐ స్టాఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు ఎంఏ ముతీబ్ ఖురేషీ, కీ క్యూబిక్ టెక్నాలజీ సీఈవో మీర్ ముస్తాక్ అలీ అబ్రార్, హజర్ మక్సూచి, అబ్దుల్ మాజీద్‌లు ప్రారంభించగా ప్రత్యేక ఆహ్వానితులుగా సైఫ్ ఉల్లా, రిజ్వాన్ అలీ మహ్మద్, డాక్టర్ ముక్తార్ అహ్మద్ ఫర్దీన్లు పాల్గొన్నారు.