మణికొండ, జనవరి 2: నిర్మాణుష్య ప్రాంతంలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాల్లోకి వెళితే… లంగర్‌హౌజ్ ప్రాంతానికి చెందిన మల్లిఖార్జున్(31) యువకుడు గురువారం సాయంత్ర గండిపేట చెరువు సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అతడి ఆర్థనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని చూసేలోపే అధిక శాతం కాలిపోయాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లంగర్‌హౌస్ నుంచి గండిపేటకు మృతుడు ఎందుకు వచ్చాడు?బలవన్మరణానికి కారణాలేమిటనే అంశాలపై విచారణ చేపడుతున్నామని ఇన్స్పెక్టర్ హరికృష్ణరెడ్డి తెలిపారు.