Viral Video | హైదరాబాద్ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఛాలెంజ్..
Viral Video | ఛాలెంజ్.. ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొన్నది. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్నేహితులు రెచ్చగొట్టడంతో అతను చెరువులోకి దూకాడు. కాసేపటికే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
Viral Video | హైదరాబాద్ : ఛాలెంజ్.. ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొన్నది. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్నేహితులు రెచ్చగొట్టడంతో అతను చెరువులోకి దూకాడు. కాసేపటికే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ నలుగురు స్నేహితులు ఆటోలో ఇటీవలే కర్ణాటకలోని కలబురాగి జిల్లాకు వెళ్లారు. కమలాపూర్ తహసీల్ పరిధిలోని ఓ చెరువు వద్ద వారు ఆగారు. అప్పటికే నలుగురు పీకల దాకా మద్యం సేవించి ఉన్నారు. అయితే ఓ యువకుడు చెరువులో ఈత కొడుతున్నాడు. సాజిద్ అనే యువకుడిని మరో స్నేహితుడు రెచ్చగొట్టాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న సాజిద్ చెరువులోకి దూకేశాడు. ఒడ్డుకు చేరుకునేందుకు అతను ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చెరువులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఆరు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాజిద్ మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మద్యం మత్తులో స్నేహితులతో ఛాలెంజ్ చేసి నదిలో దూకిన యువకుడు.. మునిగిపోతున్న పట్టించుకోని స్నేహితులు.
హైదరాబాద్ – చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు.
ఫుల్లుగా మద్యం తాగిన మైకంలో స్నేహితులు… pic.twitter.com/0wrfHfT7X1
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

