నర్సరీ మొక్కల మాటున.. గంజాయి తరలింపు
ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు.
- రూ.కోటి విలువైన ఎండు గంజాయి స్వాధీనం..
- వివరాలు వెల్లడించిన బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు
కుత్బుల్లాపూర్, డిసెంబర్16 : ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ ఇండోర్ తీన్ఇమ్లీ ప్రాంతానికి చెందిన బబ్లూఖరే అలియా స్ కృష్ణ (23), బర్నావర్కు చెందిన గోవింద్ పాటిదార్(42) లారీ డ్రైవర్లు. ఇద్దరు కలిసి ఒడిశా ప్రాంతానికి చెందిన బబ్లూ నుంచి మహారాష్ట్ర లాతూర్‌లో ఉన్న అరవింద్ వద్దకు 400 కేజీల ఎండు గంజాయిని లారీలో నర్సరీ మొక్కల మాటున తరలిస్తున్నారు.
ఈ క్రమంలో మార్గమధ్యలో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని టీఎస్ఐఐసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే… విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం బాలానగర్ ఎస్ఓటీ టీంతో పాటు జీడిమెట్ల పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో పట్టుకున్నారు. కాగా రూ.కోటి విలువ చేసే ఎండు గంజాయితో పాటు లారీ, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు డ్రైవర్లను రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు బబ్లూ, అరవింద్ పరారిలో ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

