కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 20: సరదా గా స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఓ యువ వైద్యురాలు, కర్ణాటకలో ని తుంగభద్ర నదిలో ఈత కోసం దూక గా ప్రవాహం ఎక్కువై గల్లంతైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుం బ సభ్యులు, స్థా నికులు తెలిపిన ప్రకారం, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లిలో ఎలా మైసిన్ గ్రేటెడ్ కమ్యూనిటీలోని రెండో ఫేస్ -2 విల్లా నం.303లో ఉంటున్న హనుమాన్ రావుకు ఇద్దరు కుమార్తెలు.
వీరిలో చిన్న కుమార్తె అనన్యా రావు(26) నగరం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో ఫిజీషియన్‌గా పని చేస్తుంది. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో సరదాగా తన స్నే హితులతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేసుకుం ది. తన ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితతో కలిసి కర్ణాటకలోని హంపీ టూర్‌కు వెళ్లారు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలను చూసిన వీళ్లు, మంగళవారం ఫిబ్రవరి 18న రాత్రి సణాపుర గ్రామంలోని ఓ గెస్ట్ హౌస్‌లో బస చేశా రు. బుధవారం ఫిబ్రవరి 19న మధ్యా హ్నం సమయంలో తుంగభద్ర నదికి వెళ్లారు.
అక్కడికి వెళ్లిన అనన్యా రావు.. సరదాగా ఈత కొట్టాలనుకునుకుంది. అందుకు సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్య నదిలో దూకింది. అప్పటి వరకు ఒడ్డున ఉన్న తన స్నేహితులు సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్న క్రమంలో కాసేపటికే నదిలో ప్రవాహం ఎక్కువవటంతో.. ఆ ప్రవాహంలో వైద్యురాలు కొట్టుకుపోయింది. అనన్యా రావు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్నేహితులు.. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే.. అనన్యా రావు కనిపించకుండాపోయింది.
అప్రమత్తమైన ఆమె స్నేహితు లు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని గాలిం పు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం వర కు ప్రయత్నించడంతో ఆలస్యంగా అన న్య మృత దేహం లభించినట్లు సమాచారం. కాగా, కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.