మహేశ్వరం, మే 7: బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు శ్రీవెన్న ఈశ్వరప్ప పేర్కొన్నారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో మహాత్మ బసవేశ్వరుని జయంతి కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు శంకరప్పతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరశైవ లింగాయత్‌ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, కోశాధికారి దినేశ్‌పటేల్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మన్సాన్పల్లి సర్పంచ్ కంది అరుణరమేశ్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరోళ్లచంద్రయ్య ముదిరాజ్, నాయకులు కందిరమేశ్, శివకుమార్, శివానందం, విశ్వనాథం, బుచ్చిలింగం, మల్లప్ప మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.