మలక్‌పేట, మే 7 : సలీంనగర్‌లోని శ్రీవాణి (ఫర్హత్) దవాఖానలో శనివారం ఉదయం షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమా దం సంభవించింది. ఓపీ విభాగం పూర్తిగా దగ్ధమైంది. గేట్ పక్కనే ఉన్న ఫార్మసీకి మంటలు వ్యాపించటంతో పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ముగ్గురు పేషెంట్లు, నలుగురు వైద్య సిబ్బంది ఉండటంతో వారిని సుధీర్‌రెడ్డి ఇంట్లోకి తరలించారు. పేషెంట్లను కేజీహెచ్ దవాఖానలో చేర్పించామని నిర్వాహకులు డాక్టర్ ఉమాకాంత్‌గౌడ్ తెలిపారు. అప్రమత్తమైన బ్బంది ఫైర్‌స్టేషన్‌కు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మలక్‌పేట ఇన్స్పెక్టర్ కస్పరాజు శ్రీనివాస్, డీఐ నాను నాయక్, ఎస్ఐలు సుభాష్, సురేశ్, సాయితేజ పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డీఆర్ఎస్ టీం మంటలు వ్యాపించకుండా ప్రయత్నించారు.
ఐదు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఓపీ విభాగం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలాన్ని అడిషనల్ డిప్యూటీ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఫైర్ అధికారులు గోవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్ , కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి సందర్శించారు. ప్రమాదంలో రూ.10 నుంచి 12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం కలుగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నామన్నారు.