కేపీహెచ్బీ కాలనీ, మే 5 : ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలని కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం కూకట్పల్లి డివిజన్ దీనబంధు కాలనీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణా తరగతులపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, నిరుద్యోగులంతా కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని కోరారు. ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్, టీఎస్పీపీఎస్సీ గ్రూపు పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8639917185 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.