కేపీహెచ్‌బీ కాలనీ, మే 5 : ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే కృష్ణారావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలో చేపట్టిన తాగునీటి పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ పనులు పూర్తైన రోడ్లను బాగుచేయాలన్నారు. నియోజకవర్గంలో నూతనంగా పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు సత్యనారాయణ, గోవర్ధన్‌గౌడ్, జలమండలి జీఎం ప్రభాకర్‌రావు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.