మణికొండ/మైలార్‌దేవ్‌పల్లి/బండ్లగూడ/శంషాబాద్ రూరల్/అత్తాపూర్ మే 3 : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్య ప్రకాశ్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు బషీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని ముస్ల్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, నర్సింహ, నాయకులు నీలేశ్ప్రసాద్ దూబే, సురేశ్‌గౌడ్, రూపారెడ్డి, రషీద్,ధన్రాజు,జయరాజ్,ప్రమోద్‌రెడ్డి పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ అతాఉల్లా ముస్ల్లింలు ఎమ్మెల్యే నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువు, దర్గా ఖలీజ్‌ఖాన్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ఒకరికొకరు కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మేయర్ మహేందర్‌గౌడ్ పీ అండ్ టీ కాలనీలోని మసీద్‌ల వద్ద ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సుల్తాన్‌పల్లి, మల్కారం, కాచారం, పెద్దషాపూర్, పెద్దతూప్ర, నర్కూడ,ఘాన్సిమియాగూడ, ముచ్చింతల్, పాలమాకుల, జూకల్, చిన్నగోల్కొండ, హమిదుల్లానగర్, రషీద్‌గూడ,కేబిదొడ్డి తదితర గ్రామాలలో రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. సుల్తాన్‌పల్లిలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, పెద్దతూప్రలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, నర్కూడలో సర్పంచ్ సిద్ధులు, పెద్దషాపూర్లో చెక్కల చంద్రశేఖర్, శంషాబాద్ మున్సిపాలిటీలో ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, గణేశ్‌గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్ బండిగోపాల్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.