అబిడ్స్, సుల్తాన్‌బజార్, మే 3 : రంజాన్‌ను గోషామహల్ నియోజక వర్గంలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. జాంబాగ్, బేగంబజార్, గన్‌ఫౌండ్రీ, మంగళ్‌హాట్, దత్తాత్రేయనగర్, గోషామహల్ డివిజన్లలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సామూహిక ప్రార్థనలను పురస్కరించుకుని అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పబ్లిక్‌గార్డెన్స్‌లోని మసీదులో ప్రార్థనలు జరిగాయి. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీనకు మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్, టీఆర్ఎస్ నాయకులు శశిరాజ్ సింగ్, రాకేశ్‌సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మహ్మద్ అబ్దుల్ సమి, మహ్మద్ సలాం, మహ్మద్ యాసీన్, ఉబేద్, మహ్మద్ ఫరీద్ ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్, ప్రియాగుప్తా, ఎం.శ్రీనివాస్ గౌడ్, దుర్గ, విజయ్ ముదిరాజ్, రేఖ, మాధవి, నరేశ్ గౌడ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం. ముజీబ్హుస్సేనీని ఆయన నివాసంలో మంగళవారం టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్ కలుసుకొని శాలువాతో సన్మానించి ఈద్ ముబారక్ తెలిపారు. కార్యక్రమంలో జహంగీర్, వహీద్, రాజ్‌కుమార్, శ్రీనివాస్, తేజ, ఉస్మాన్ అలీ ఉస్మానీ, రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీ. ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు ..
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌కు కార్పొరేటర్ ఎం.స్వామియాదవ్, ఎంఐఎం నాయకులు శివశంకర్ టోలిచౌకిలో ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నానల్‌నగర్ హకీంషా బాబా దర్గా వద్ద ప్రార్థనల్లో కార్వాన్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ తెలిపారు. మల్లేపల్లి బడీ మసీద్ వద్ద బందోబస్తులో పాల్గొన్న పోలీసుల జాఫర్‌ఖాన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్, కార్పొరేటర్లు నసీరుద్దీన్, స్వామియాదవ్, కార్పొరేటర్ల ప్రతినిధులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, వజీఉజ్జమాసిద్ధికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీనకు నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్, నగర మాజీ మేయర్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.