
బోడుప్పల్, జనవరి 2: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్మశాలి సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మేయర్ బుచ్చిరెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పద్మశాలీల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో..
కీసర : కీసరగుట్టలో భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు మంచాల పాపయ్య నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులందరూ సంఘం ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులను పొందాలని, గుర్తింపు కార్డులున్న కార్మికులకు మాత్రమే ప్రభుత్వపరంగా వచ్చే రాయితీలు అందుతాయన్నారు. సంఘం సభ్యులు పాల్గొన్నారు.
శాలివాహన సంఘం ఆధ్వర్యంలో..
జవహర్‌నగర్ : కుమ్మరుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌గుప్తా అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ కార్పొరేషన్లో కుమ్మ రి శాలివాహన సంఘం అధ్యక్షుడు తరిగొప్పుల పాండరి ఆధ్వర్యంలో రూపొందించిన 2022 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోశారన్నారు. టీఆర్ఎస్ నాయకుడు మేకల అయ్యప్ప, కృష్ణగౌడ్, శ్రీనివాస్, ఎస్సై మోహన్, కుమ్మరి సంఘం నాయకులు కరుణాకర్, మల్లేశ్, బాలరాజు, సురేశ్, సంజీవులు, పాల్గొన్నారు.
రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
మేడ్చల్ కలెక్టరేట్ : రెడ్డి కులస్తులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2022 క్యాలెండర్‌ను చంద్రారెడ్డి ఆవిష్కరించారు. సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కురుమ సంఘం ఆధ్వర్యంలో…
నాగారం కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆవిష్కరించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, కురుమ సంఘం నేతల గొంగళ్ల స్వామి, మేకల అయ్యప్ప, చీర సురేశ్, వెంకటేశ్, అంజయ్య, పాండు, గణేశ్, భాస్కర్ పాల్గొన్నారు.