దుండిగల్, ఏప్రిల్ 28: ఆలయాలు, అర్చకుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ధూప, దీప, నైవేద్య పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మే 20 వరకు గడువును పొడిగించిన నేపథ్యంలో గురువారం హరిహర అర్చక సంఘం అధ్యక్షుడు శ్రీరంగం గోపీకృష్ణ నేతృత్వంలో అర్చకులు పేట్‌బషీరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధూప, దీప, నైవేద్య పథకం కోసం రాష్ట్ర ప్రభు త్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.720 కోట్ల నిధులను కేటాయించిందని, ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 1,763 ఆలయాలకు ప్రతి నెలా రూ.6వేల చొప్పున నిధులు అందజేయనున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ అర్చకులు, ఆలయాల సంక్షేమానికి పెద్ద పీఠ వేశారని, ఈ పథకానికి అర్చకులు దరఖాస్తు చేసు కుని లబ్ధిపొందాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో అర్చక సంఘం నాయకులు మల్లికార్జునస్వామి, ఓంకార్‌నాథ్ శర్మ, రాంబాబు, పరమేశ్వరస్వామి, శ్రావణ్స్వామి ఉన్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు..
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ మహిళా నాయకుల ఆధ్వర్యంలో గురువారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఇందిరారెడ్డి, పద్మనాగ శిరోమణి, ఆసియా, మంగ, వినోద, సుకన్య, అనిత, అన్నపూర్ణ, మాధవి తదితరులు ఎమ్మెల్యే వివేకానంద్‌తో కేక్ కట్ చేయించి సంబురాలు జరుపుకున్నారు.