సిటీబ్యూరో, ఏప్రిల్ 23 ( నమస్తే తెలంగాణ ):ఒకరు పేదల ఆకలి తీర్చాలని అనుకున్నారు.. మరొకరు బాలికల హక్కుల కోసం పోరాడుతున్నారు. మార్గం వేరయినా సేవే లక్ష్యంగా సాగుతున్న ఆ ఇద్దరి మహిళల కృషికి ట్విట్టర్ ఇండియా సలాం కొట్టింది. సామాజిక విషయాలపై వారు స్పందిస్తున్న విధానానికి ఫిదా అయింది. ట్విటర్ ఇండియా, సేఫ్టీ సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఛేంజ్ మేకర్స్ జాబితాను సిద్ధం చేసి, అందులో 17 మంది ఆదర్శ మహిళలను ఎంపిక చేశారు. ఆ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన రైస్ బకెట్ చాలెంజ్ ఫౌండర్ మంజులత కళానిధి, వాయిస్ ఫర్ గర్ల్స్ ఎన్జీవోఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష భరద్వాజ ఉన్నారు.
మేడ్చల్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమ పూర్తయింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో తొలి దశలో 561మందిని ఎంపిక చేయగా, లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమను పూర్తి చేశారు. వివిధ యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు వ్యాపారాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ట్రెడ్ లైసెన్స్‌లను అధికారులు అందించే పనిలో ఉన్నారు. ఇందుకు గాను అద్దె ఒప్పంద పత్రాలు, స్వంతంగా మడిగెలు, స్థలాలు ఉన్నవారైతే ఆస్తి పన్నుల రశీదులు సమర్పించాలని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఆర్థికాభివృద్ధి సాధించి తీరుతామని లబ్ధిదారులు ధీమాగా చెబుతున్నారు.
లైసెన్స్ రాగానే వ్యాపారం
వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాం. యూనిట్‌కు సంబంధించి ఖాతాలో నగదును ప్రభుత్వం జమ చేసింది. లేడీస్ ఎంపోరియం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ట్రెడ్ లైసెన్స్ కోసం అధికారులకు ధ్రువ పత్రాలు సమర్పించాం. లెసైన్స్ రాగానే వ్యాపారం మొదలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
దళితులకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులందరూ రుణపడి ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దళిత బంధు నగదుతో వ్యాపారం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించి తీరుతాం.
ఆర్థికంగా ఎదుగుతాం
దళితుల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. దళిత బంధు నగదుతో రెడీమేడ్ బట్టల దుకాణం ప్రారంభిస్తా. దళితులను వ్యాపారాలు చేసుకునే స్థితికి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు నమ్మకాన్ని నిజం చేసి ఆర్థికంగా ఎదుగుతాం.