మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 23 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. హిందువులకు బతుకమ్మ పండుగకు చీరలను అందజేసినట్టు ముస్లింలు, క్రైస్తవులకు రంజాన్, క్రిస్మస్ సందర్భంగా కొత్త దుస్తులు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు.
సాగు, తాగునీరు, 24 గంటల కరెంట్ ఇలా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలోనే ఎంతో ప్రగతిని తెలంగాణ సాధించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు రణదీప్‌రెడ్డి, సురేశ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, నాయకులు, తాసీల్దార్ గీత, ఎంపీడీవో రమాదేవి, కౌన్సిలర్లు మానస, సరిత, దేవరాజ్, హరికృష్ణ, మహేశ్, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ అహ్మద్ షఫీయుల్లా పాల్గొన్నారు.
నాగారం మున్సిపాలిటీ పరిధిలో..
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మసీద్‌లో ముస్లింలకు రంజాన్ కానుకలను చైర్మన్ చంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులకు రంజాన్, క్రిస్మస్ సందర్భంగా బట్టలను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కమిషనర్ వాణిరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.