దుండిగల్/కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 22 : సీఎం కేసీఆర్ కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దూలపల్లి, బహదూర్‌పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 7300 కోట్లు కేటాయించారని తెలిపారు. దీనిలో భాగంగానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 9 పాఠశాలలకు రూ.3కోట్ల 99లక్షల 55 వేలు కేటాయించారని, ఈ నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి…దూలపల్లిలో రెండు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.80.60 లక్షలు, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి… బహదూర్‌పల్లిలో రెండు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.71 లక్షలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి నేటి బాలలను రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు మార్పులు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీల కమిషనర్లు రఘు, భోగీశ్వర్లు, చైర్మన్లు ఎస్.శ్రీశైలం, వైస్ చైర్మన్లు రత్లావత్ గంగయ్యనాయక్, పద్మారావు, డీఈఓ విజయలక్ష్మి, ఎంఈఓ ఆంజనేయులు, పంచాయితీరాజ్ ఏఈ నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు, కిరణ్, రవీందర్‌యాదవ్, సత్యనారాయణ, నర్సింగం, భరత్ పార్టీ సీనియర్ నేతలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం
సుచిత్ర మెయిన్‌రోడ్డులో డెకట్లాన్లో ఎస్బీ బాస్కెట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో పాటు స్థానిక సీఐ రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.