గోల్నాక, ఏప్రిల్ 22: నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్‌లో రూ.13 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైప్‌లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో భవిష్యత్‌లో కలుషిత తాగునీరు సరఫరా సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి నేటి అవసరాలకు అనుగుణంగా తాగునీటి పైప్లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అంబర్‌పేట, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ తదితర డివిజన్ల వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. అనంతరం బస్తీలో పలు శాఖల అధికారులతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు కుశాల్, ఇన్స్పెక్టర్ రమేశ్, దుర్గా, అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్ధ్ముదిరాజ్, ఆంజనేయులుతో పాటు పలువరు నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.
రంజాన్ కానుకల పంపిణీ
అంబర్‌పేట డివిజన్ మున్సిపల్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యేపంపిణీ చేశారు.