మొయినాబాద్: వేద పండితుల మంత్రోచ్ఛారణ లు.. భక్తుల గోవింద నామస్మరణలు… మంగళ వాయిద్యాలు.. భక్తుల కోలాహలం మధ్య కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి కమణీయంగా.. కడు రమణీయంగా జరిగింది. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని పురోహితులు అ త్యంత వైభవంగా నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో నాలుగు రోజులుగా బ్రహ్మోత్సవాలు కను ల పండువగా కొనసాగుతున్నాయి. అందులో భాగం గా గురువారం రాత్రి 11 గంటల నుంచి అర్దరాత్రి ఒం టి గంట వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల కల్యాళ మహోత్సవం అర్చకులు పరవస్తు రంగాచార్యుల వారి ఆధ్వర్యంలో 25 మంది వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలతో కల్యాణ మహోత్సవాన్ని ప్రా రంభించారు. ముందుగా శ్రీవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయం చుట్టూ గోవింద నామస్మరణల మధ్య ఊ రేగించారు.
అనంతరం అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిల ను సైతం చిన్నారుల నృత్యాలతో ఊరేగింపుగా స్వామి వారి చెంతకు తీసుకెళ్లి ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారి ప్రసాదం స్వీకరించా రు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, పూజారులు రంగరాజన్, కన్నయ్యస్వామి, ము రళి, నరసింహా, బాలాజీస్వామి, సుదర్శన్, సురేష్ స్వా మి, సర్పంచ్ గునుగుర్తి స్వరూప, ఉప సర్పంచ్ సుధాకర్‌రెడ్డి ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీవారి కల్యాణానికి పట్టు వస్ర్తాలను గ్రామ పంచాయతి పాలకవర్గం గునుగుర్తి స్వరూప, ఉప సర్పంచ్ సుధాకర్‌రెడ్డి, సభ్యులు, గున్నాల వంశీయులు ఊరేగింపుగా వచ్చి స్వామి వారికి సమర్పించుకున్నారు.