కుత్బుల్లాపూర్,ఏప్రిల్15 : మేడ్చల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూ చించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో దళితవాడలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఈ నెల 19 నుంచి సూరారం శివాలయనగర్లోని బాబూ జగ్జీవన్‌రామ్ అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతులు ని ర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న ఆన్లైన్లో http://tsstudycircle.co.in తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. దళిత సంఘాల నాయకులు ఏసురత్నం, యాదగిరి, సత్యనారాయణ, ఆటో బలరాం, గడ్డం శ్రీను, రాంచందర్, అశోక్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిటీ సభ్యులు
షాపూర్‌నగర్‌కు చెందిన శివ హనుమాన్ సాండ్ సైప్లెయిస్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, కార్యదర్శి వినోద్‌కుమార్, కోశాధికారి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి రాజమౌలి, రవీందర్‌రెడ్డి, సలహాదారులు రామ్‌రెడ్డి, శివరాజు పాల్గొన్నారు.
ఆహ్వాన పత్రం అందజేత..
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో పద్మానగర్ ఫేస్-1, ఫేస్-2లో కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి నిర్వహించే దివ్యనాగ సాయిబాబా, సిద్ధేశ్వర స్వామి మందిరం వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని కోరుతూ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రాన్ని అందించారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, కార్యదర్శి సత్తిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, హనుమంత్‌రావు, విజయసాయిరెడ్డి, శంకరయ్య, మురళీధర్, భాస్కర్‌గౌడ్, కామేశ్, వీరేశ్ పాల్గొన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ..
కుత్బుల్లాపూర్ నార్త్‌జోన్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం సూరారం భీమాగార్డెన్ నుంచి కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వరకు నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వాల్ పోస్టర్, కరపత్రికలను, టీ,షర్టులను ఆవిష్కరించారు. పాస్టర్ గోడి శేఖర్, విజయ్ భాస్కర్, చెన్నపురెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.