ఖైరతాబాద్, ఏప్రిల్ 15 : విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం గ్లోబల్ ఎడ్యుకేషన్‌కు చక్కని వేదికగా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లోని సెంట్రల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఐక్యూ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కార్యాలయాన్ని అల్లం నారాయణ, ఆ సంస్థ సీఈవో ప్రతీమ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. .విదేశాల్లో చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారికి సరైన గైడెన్స్, సరైన మార్గదర్శకత్వం చేయాలని, ఉన్నత విద్యను చదువుకునేందుకు మార్గం సుగమమం చేయాలని కోరారు. సీఈవో ప్రీతమ్ రెడ్డి మాట్లాడుతూ యూఎస్, యుకే, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు యూరప్‌లోని 25 దేశాల్లో యూజీ, పీజీతోపాటు వైద్య విద్యనభ్యసించేందుకు మార్గనిర్దేశం చేస్తామన్నారు.దుబాయి, జర్మనీ, కెనడాలో ఇప్పటికే తమ బ్రాంచ్‌లు ఉన్నాయని, దేశంలోనే మొదటి బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించామన్నారు. ప్రపంచంలోని 500 విశ్వవిద్యాలయాలతో తమ సంస్థకు భాగస్వామ్యం కలిగి ఉందన్నారు.