చంపాపేట, ఏప్రిల్ 15 : ఆలయ పాలక మండలి ధర్మకర్తలు ఆలయ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తలుగా ఇటీవల రెండో దఫా నియామకమైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్, సామ రంగారెడ్డి, చేగోని మల్లేశ్ గౌడ్, చాతిరి అకిలసాగర, నర్రె శ్రీనివాస్, చలమల యాదిరెడ్డి, దేవరపల్లి వెంకట్‌రెడ్డి, చొలకరి అనిత, చేగోని అశోక్‌గౌడ్, ఇమ్మిడి జంగయ్య, సిరిపురం రాజు, బసిగూడెం జంగారెడ్డి, పద్మాల శంకర్, జై శంకర్ ప్రసాద్ శుక్ల 15 మంది శుక్రవారం టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 15మందికి శాలువాలతో సన్మానం చేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పాలక మండలి ధర్మకర్తలు ఆలయ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ ముదిరాజ్, అనసూయ, మాధవి, మేక సురేందర్‌రెడ్డి, నిష్కాంత్రెడ్డి, గూడురు గౌతంరెడ్డి, గోగు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాపై ఎమ్మెల్యేకు విన్నపం
గడ్డిఅన్నారం డివిజన్ గౌతంనగర్ కాలనీలో గత 15 రోజులుగా తాగునీరు లోప్రెషర్‌తో సరఫరా అవుతుందని, దీంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి విన్నవించారు. గౌతం నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు, ప్రధాన కార్యదర్శి కళ్లెం మధుసూదన్‌రెడ్డిలతో పాటుగా కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి తాగునీటి సరఫరా సక్రమంగా జరుగకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అదే విధంగా కాలనీలోని కొన్ని భూగర్భ డ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్లను కూడా మంజూరు చేయాలని, కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని కోరారు. ఎమ్మెల్యే తాగునీటి లోప్రెషర్ సమస్యలను సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు కృష్ణ, మక్బూల్, ప్రవీణ్ప్రసాద్, రాజేందర్ గౌడ్, బాలకృష్ణ, రాజిరెడ్డి, మధు, వెంకటేశం, శిరీష, కృష్ణయ్య, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.